28, జులై 2010, బుధవారం

మర్యాద రామన్న సమీక్ష



సంస్థ :  ARKA media. (వేదం నిర్మాణ సంస్థ)
కథ :- రామినీడు రాయలసీమలొ సాంప్రదాయాలకు విలువనిచ్చే భూస్వామి . ఇంటికి వచ్చిన అతిధి కి రాచమర్యాదలు చేస్తారు. అలానే పరువు, పగ కోసం ప్రాణాలు తీస్తారు. సుప్రీత్,సలోని,వేణుగోపాల్ అతని సంతానం. రామం బ్రతుకుతెరువు వెతుక్కునే అనాథ . ఒక పని నిమిత్తం ఇతను సీమ కు వెళ్ళి రామినీడు కి అతిధి అవుతాడు . కాని తరువాత అతనిది రమినీడు పగబట్టిన వంశం అని తెలుస్తుంది . అతిధి మర్యాదలను అడ్డం పెట్టుకుని తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నడనేది మిగిలిన కథ.

నటీనటులు ప్రదర్శన :-
సునీల్ :- ఈ సినిమా కోసం చాల సన్నబడ్డాడు . కొంచెం కామెడీ కొంచెం భయం నిండిన భావాలలొ రాణించాడు . ఇంక డాన్సులు ఐతే బాగా చేశాడు.
సలోని :- బొద్దుగా ఉన్నా బాగుంది. ఒక్క "రాయె రాయె సలోని" పాట తప్ప సినిమ అంతటా వస్త్రధరణ బాగుంది.
నాగినీడు :- కొత్త నటులు . ప్రసాద్ లాబ్స్ లొ పని చేసేవారని విన్నాను. గంభీర సన్నివేశాలలొ మెప్పించినా రౌద్ర రసంలో మోతాదు ఇంకా పెంచాలి.
సుప్రీత్ :- రొటీను కి భిన్నం గా నటించి ఆకట్టుకున్నాడు.
వేణుగోపాల్:- కొత్త నటుడు అయినా సునాయాసంగా నటించాడు.
బ్రహ్మాజి :- చాల కాలం తరువాత తనకి దొరికిన ఒక చక్కని పాత్ర ద్వార మంచి ప్రతిభ కనబరిచారు.

సంగీతం :- బావుంది , రీ-రికార్డింగ్ ఇంకా బాగుంది.
ఛాయాగ్రహణం :- బావుంది , ముఖ్యంగా "హరోం హరా" పాట అద్భుతం .
కూర్పు :- చాలా సాదా సీదాగా ఉంది . ఈ సినిమా కి ప్రధాన ప్రతికూలాంశం.

నచ్చిన అంశాలు:
సాంకేతిక పనితనాన్ని చక్కగా ఉపయొగించుకోవడంలో రాజమౌళి దిట్ట అని ఇంకోసారి నిరూపితమైంది.గ్రాఫిక్స్ ద్వారా "సైకిల్" పాత్ర సృష్ఠి బావుంది. సైకిల్ పాత్రకి రవి తేజ చెప్పిన మాటలు నవ్వులని బాగా కురిపించాయి. ముఖ్యముగా నాకు ఈ సినిమా లొ నచ్చిన పాట ,సిరివెన్నెల రచించి బాలు ఆలపించిన "హరోం హరా". బ్రహ్మాజి పాత్ర చాలా బాగా రూపొందింపబడింది. సినిమా అంతటికి చక్కగా కుదిరిన పాత్ర.సుప్రీత్ ,అదేనండి ఛత్రపతి సినిమా లొ కాట్రాజ్ , ఈ సినిమాలొ మంచి నటనతో నవ్వించారు.
నచ్చని అంశాలు :
ఈ సినిమా నిడివి కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే. సినిమా అయిపోయాక అప్పుడే అయిపొయిందా అని అనిపిస్తుంది . పాటలు కూడా వున్న సినిమా కేవలం రెండు గంటల్లో ముగిసిపొతే బాగోదు.రామినీడు పాత్ర స్వరం ఇంకా కొంచెం పెద్ద గా ,గంభీరం గా ఉంటే బావుండేది.జయప్రకాష్ రెడ్డి, సాయాజి షిండే, ప్రదీప్ రావత్ ల కేకలకు అలవాటు పడ్డవాళ్ళం కదా.
తీర్పు : చూడదగ్గ సినిమా