21, డిసెంబర్ 2012, శుక్రవారం

'ఎటో వెళ్ళిపోయింది మనసు' సమీక్ష

                                      
                                                     
  ఒక మామూలు ప్రేమ కథ కు సహజమైన సంభాషణలు , శ్రావ్యమైన సంగీతం , నాయికా నాయకుల ఉత్తమ  నటన తోడైతే  అది "ఎటో వెళ్ళిపోయింది మనసు"!!

అద్భుతమైనా ప్రేమ కథ ని తెరకెక్కించడంలో గౌతం మీనన్ తనకు తానే సాటి అని ఈ చిత్రంతో  నిరూపించుకున్నారు. ఖచ్చితంగా ఏ మాయ చేశావే కంటే మంచి చిత్రం అందించారు.

కథ: ఒక అబ్బాయి, అమ్మాయి జీవితాలలొ వేరు వేరు దశలలొ వారి ప్రేమాయణం ఎలా సాగింది అనేదే ఈ కథ
నచ్చిన అంశాలు :
నటీనటుల ప్రదర్శన ,సంగీతం , మాటలు , సమంత .
నటన: సహజ ప్రేమకథ కు సరిపొయే భావోద్వేగాలు పండించడంలో  నాని , సమంత ఇద్దరూ చాలా బాగా సఫలీకృతమయ్యారు.కృష్ణుడు నవ్వించాడు.

నా అనుభవంలో ఏ నాయికైనా మొదటి రెండు మూడు సినిమాల వరకే అందంగా ఉంటుంది..కాని ఈ సినిమలో సమంత ఇంతకుముందు తన సినిమాలన్నింటికన్నా అందంగా ఉంది.

సంగీతం : ఇళయరాజా .. మళ్ళీ మనకి పాత ఇళయరాజా తన స్వరాలతో  విందు భోజనం వడ్డించారు . నేపథ్యసంగీతం బాగుంది.
తీర్పు: ప్రేమించిన వాళ్ళు తమని తాము పోల్చుకుంటారు, ప్రేమించని వాళ్ళు సరదాగా ఆస్వాదించగలరు
గమనిక : వీలైనంత వరకు నిశ్శబ్ద వాతావరణం ఉన్న హాలు/ఆట కి సినిమ చూడండి. పక్కా క్లాస్ సినిమా..మాస్ కామెంట్లు చేయచ్చు.