3, నవంబర్ 2012, శనివారం

కృష్ణం వందే జగద్గురుం

                                    కృష్ణం వందే జగద్గురుం




జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం
పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం
జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం

మత్స్యావతారము :
------------------
చెలియలి కట్టను తెంచుకుని  విలయము విజృంభించునని
ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతము ఎదురై ముంచునని
సత్యవ్రతునకి సాక్షాత్కరించి సృష్ఠి రక్షణకు చెయూతనిచ్చి
నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం

కూర్మావతారము:
--------------------
చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే
పొందగోరినదందలేని నిరాశలొ అణగారిపోతే
బుసలుకొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది
----క్షీరసాగర మధన మర్మం-----

వరాహవతారము:
-------------------
ఉనికిని నిలిపే ఇలను కడలిలొ కలుపగ ఉరికే ఉన్మాదమ్మును
తరాల దంష్టృల కుళ్ళగించి ఈ ధరాతలమ్ముని ఉద్ధరించగల
ధీరోద్ధతి  రణ హుంకారం ఆది వరాహపు ఆకారం

నృసింహావతారము:
-------------------
హిరణ్యకశిపుడు||
ఏడి ఎక్కడరా నీ హరి?
దాక్కున్నాడేరా భయపడి?
బయటకి రమ్మనరా ఎదుటపడి
నన్ను గెలవగలడా తలపడి?

ఫ్రహ్లాదుడు||
నువు నిలిచిన ఈ నేలను అడుగు---భూమి
నాడుల జీవ జలమ్మును అడుగు-----నీరు
నీ నెత్తుటి వెచ్చదనాన్ని అడుగు---నిప్పు
నీ ఊపిరిలో గాలిని అడుగు--------గాలి
నీ అణువుల ఆకాశన్నడుగు--------ఆకాశం
నీలో నరుని హరిని కలుపు
నీవే నరహరివని నువు తెలుపు

వామనావతరము:
-----------------
అమేయ అనోహ్య అనంత విశ్వం ఆ బ్రహ్మండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం
కుబ్జ్యాకృతిగా బుద్ధిని భ్రమింప చెసే అల్ప ప్రమాణం
ముజ్జగాలను ముడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం

జరుగుతున్నది జగన్నాటకం జగజగజగ జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం జగజగజగమే నాటకం

పరశురమావతారము:
---------------------
పాపము తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మ అఙానిని పెరుకగ
పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై
ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌత్రియ క్షత్రియ తత్వమే భర్గవుడు

రామావతారము:
-----------------
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యము కాని ఏ మర్మము లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇల లోన నిలచే 

కృష్ణావతారము:
-------------------
ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా
నిన్ను నీకే నూత్న పరిచితునిగా
దర్సింపజేయగల ఙాన దర్పణము
కృష్ణావతారమే సృష్ఠ్యావరన తరణము

అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకమ్యవర్తిగా ఈసత్వముగా వసిత్వమ్ముగా
నీలోని అష్టసిద్ధులు నీకు తంబట్టగా స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా
నురుని లోపలి పరుని పై దృష్టి పరుపగా
తలవంచి కైమొడ్చు శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడతేర్చు అచర్యుడవు నీవే

వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం

2 కామెంట్‌లు:

  1. హలో అండీ !!

    ఈ పాట సగం వరకు రాయ యత్నించి G+ lo post chesi పూర్తి చేయక వదిలివేశాను

    మీరు చక్కగా రాసారు కొన్ని చోట్ల శబ్దం అస్పష్టముగా ఉన్నది మీరు అవికూడా బాగా నేర్పుగా ఓర్పుతో వ్రాయటం జరిగినది కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  2. http://idlebrain.com/news/sirivennelapaataalu/jarugutunnadijagannatakam.html

    రిప్లయితొలగించండి