14, నవంబర్ 2012, బుధవారం

పంచారామాలు

                      

ఇతివృత్తం: పూర్వం తారకాసురడనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగం పొందుతాడు. వరగర్వంతో లోకాలను పీడింపగా విష్ణుమూర్తి సూచన మేర కుమారస్వామి అతనితో యుద్ధం చేసి ఆత్మ లింగాన్ని ఛేదిస్తాడు.ఆత్మలింగం ఐదు భాగాలుగా ఐదు చోట్ల పడుతుంది. అవే పంచారామాలు.
1. ద్రాక్షారామం : భీమేశ్వరస్వామి : 60 అడుగుల ఎత్తుతో సగం తెలుపు సగం నలుపులో వున్న లింగాన్ని రెండు అంతస్తుల నుండీ పూజిస్తారు . ఇక్కడ దక్షప్రజాపతి యగ్నం చేయటం వలన ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చినదంటారు.


2.అమరారామం :అమరేశ్వరస్వామి : కృష్ణా నదీ తీరన ఉన్న ఇక్కడి శివలింగం ఇంద్రునిచే ( అమరేశ్వరుడు) ప్రతిష్టింపబడినది. 

3.క్షీరారామం : .క్షీరారామలింగేశ్వరస్వామి : పాలకొల్లులో సీతారాములచే ప్రతిష్టింపబడినది. ఇచట శివుడి బాణం భూమిని తాకగానే పాలధార వచ్చినదట.



4.సోమారామము : సోమేశ్వరస్వామి :భీమవరంలో  చంద్రునిచే ప్రతిష్టింపబడినది. పౌర్ణమి  నాడు తెల్లగా ఉండే లింగం అమావాస్య నాటికి గోధుమ వర్ణంలోకి మారుతుంది .

5.కుమార భీమారామం : కాలభైరవుడు : సామర్లకోట లోని ఈ శివలింగం సున్నపురాయితో  చేయబడినది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి