23, జనవరి 2013, బుధవారం

పండగలా దిగివచ్చావు

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్నీ నువ్వూ
కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు

ఓ జోలాలి అనలేదే చిననాడూ  ఏనాడూ ఈ ఊరి ఉయ్యాలా
ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాలా
మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా
ఓ మా పిల్లా పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా
గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకువుగా
వేరు మూలం వెతికి మా జత చేరినావుగా                                  ||పండగలా||

ఓ పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళూ
ఓ అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూశమీ తిరణాళ్ళూ
ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిశాయి ముంగిళ్ళు
మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీవాళ్ళు ఐనోళ్ళూ
అడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడూ
ఇక కలుగుదాటి బైటపడగా బెదరడా పగవాడూ                           ||పండగలా||

22, జనవరి 2013, మంగళవారం

మరీ అంతగా మహా చింతగా

మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా
పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా
మతోయేంతగా శృతే పెంచగా విచారాల విలవిల
సరే చాలిక అలా జాలిగా తికమకపెడితే ఎలా
కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరాలా నిను చూడాలంటే అద్దం జడిసేలా

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా ?
అయ్యయ్యో పాపం అంటే ఎదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా ?

ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా
చలినెటో తరిమేస్తామా చీ పొమ్మనీ
కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా
రోజులతో రాజీపడమా సర్లెమ్మనీ
సాటి మనిషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచీ పడుతూ ఎం సాధిస్తామంటే ఎం చెబుతాం || ఎక్కిళ్ళే||

చెమటలేం చిండించాల శ్రమపడేం పండించాలా
పెదవిపై చిగురించేలా చిరునవ్వులూ
కండలను కరిగించాలా కొండలను కదిలించాలా
చచ్చిచెడి సాధించాలా సుఖశాంతులూ
మనుషలనిపించే ఋజువు  మమతలనుపెంచే ఋతువు
మనసులను తెరిచే హితవు వందేళ్ళైనా వాడని చిరునవ్వు || ఎక్కిళ్ళే||