15, నవంబర్ 2012, గురువారం

చిరునవ్వుతో



ప్రతిరోజుని ప్రభవించనీ చిరునవ్వుతో చిరునవ్వుతో
ప్రతి ఊహని బ్రతికించుకో చిరునవ్వుతో చిరునవ్వుతో
ప్రతి మనిషిని పరికించరా చిరునవ్వుతో చిరునవ్వుతో
ప్రతి రాత్రిని పవళించనీ చిరునవ్వుతో చిరునవ్వుతో

గతమన్నది గతమేనురా విలపించకు వ్యధచెందకు
విధి రాతలో కష్టాలకు  కడ యేదిరా దుఃఖించకు
తలరాతనే ఎదిరించరా చిరునవ్వుతో చిరునవ్వుతో
మున్ముందుకే అదుగేయరా చిరునవ్వుతో చిరునవ్వుతో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి